సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu), దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. నిజానికి ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఎప్పుడో రావాలి. చాలా ఏళ్ళ క్రిందట వీరి మధ్యా కథా చర్చలు జరిగాయి. అప్పట్లో ఈ సినిమా గురించి మహేశ్ బాబు హింట్ కూడా ఇచ్చాడు. కానీ ఏవో కారణాల వల్ల సినిమా అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ అప్పుడు కానీ ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వసూళ్ళు ఏ స్థాయిలో ఉండేవే తెలియదు కానీ.. ‘బాహుబలి (Bahubali), ఆర్.ఆర్.ఆర్ (RRR)’ చిత్రాలతో.. తన ముద్ర పడితే ఆ సినిమాకి మినిమమ్ వెయ్యికోట్లు అనే స్థాయిలో జక్కన్న తెలుగు సినిమాను నిలిపాడు. అలాంటి ఈ పరిస్థితుల్లో మహేశ్ తో సినిమా చేయడం అభిమానులకు పండగే అని చెప్పాలి. ఈ కాంబో మీద అంచనాలు మామూలుగా అయితే లేవు. ఈ కాంబోపై ఏ చిన్న అప్టేడ్ వచ్చినా ఎంతో ఎగ్జైట్ అయిపోతున్నారు ఫ్యాన్స్.
తాజాగా టోరెంటో ఫిల్మ్ ఫెస్టివల్ (Torento Film Festival) లో అతిథిగా హాజరయిన రాజమౌళి.. మహేశ్ తో తాను చేయబోయే సినిమాపై చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. జక్కన్న.. మహేశ్ తో తన సినిమా గురించి మాట్లాడుతూ.. Globetrotting Action Adventure అని వ్యాఖ్యానించాడు. ఆయనీమాట అనగానే అసలు ఈ Globetrotting అనే పదానికి అర్ధమేంటి? అంటూ తెగ సెర్చింగ్ మొదలెట్టేశారు అభిమానులు. ఈ పదానికి ‘ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందే’ అనే అర్ధాన్నిస్తోంది డిక్షనరీ. అంటే ఈ సినిమా పాన్ వరల్డ్ లెవెల్లో ఉంటుందని రాజమౌళి చెప్పకనే చెప్పాడు. దాంతో ఈ సినిమా గురించి గతంలో విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) చెప్పినట్టుగానే ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలోని యాక్షన్ అడ్వెంచర్ కావచ్చని చర్చించుకుంటున్నారు. అలాగే.. హారిసన్ ఫోర్డ్ నటించిన సూపర్ హిట్ ‘ఇండియానా జోన్స్’ తరహాలోని అడ్వంచరస్ మూవీ అవడానికి కూడా అవకాశాలున్నాయి. మొత్తం మీద రాజమౌళి పలికిన ఈ సరికొత్త పదం భవిష్యత్తులో భారతీయ దర్శకులందరూ కూడా కామన్‌గా వాడే పదమైపోతుందని వేరే చెప్పాల్సిన పనిలేదు. మరి ఆ అర్ధానికి తగ్గట్టుగానే మహేశ్, రాజమౌళి కాంబో మూవీ సూపర్ హిట్టై.. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతుందేమో చూడాలి.