‘‘ప్రస్తుతం నేనున్న కండీషన్ నాకు నేర్పింది ఒకటే. ఏది మన కంట్రోల్లో లేదని! ‘వాట్ నెక్ట్స్’ అంటే ఎప్పటికీ నేను జవాబు ఇవ్వలేను. నేనే కాదు ఎవరూ దీనికి సమాధానం చెప్పలేరు. జీవితం మనల్ని ముందుకు నడిపిస్తుంది అంతే. ఈ క్షణం.. ఈ రోజు ఆనందంగా ఉన్నాను అన్నదే నా చేతిలో ఉంది’’ అని అంటున్నారు సమంత(Samantha). ప్రస్తుతం ఆమె మయోసైటిస్‌తో పోరాటం చేస్తున్నారు. అలా బాధపడుతూనే ‘యశోద’(Yashoda) చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేశారు. హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా సమంత సినిమా, ఆరోగ్య పరిస్థితి (Samantha health)గురించి మాట్లాడారు.
నా ఆరోగ్యం గురించి అడిగినందుకు థాంక్యూ. ఇప్పుడు రికవరీ అవుతున్నాను. త్వరలో పరిస్థితులు మెరుగు అవుతాయని ఆశిస్తున్నాను. నా ఆరోగ్యం గురించి చాలా ఆర్టికల్స్ చూశాను. అయితే… ప్రస్తుతానికి నేను చావలేదు (నవ్వుతూ). వచ్చిన వార్తల హెడ్డింగ్స్ అప్రస్తుతం. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఫైట్ చేస్తున్నాను. నేను ఉన్న పరిస్థితిలో అది అంత ప్రాణాంతకం ఏమీ కాదు. ఈ క్షణం, నేను ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు… కొన్ని మంచి రోజులు ఉంటాయి. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఒక్కోరోజు ఇంకొక్క అడుగు కూడా ముందు వేయలేనేమో అనిపిస్తోంది. కొన్ని రోజులు వెనక్కి తిరిగి వస్తుంటే ఇంత దూరం వచ్చానా? అనిపిస్తోంది (భావోద్వేగంతో). చాలా మంది ఎన్నో సవాళ్లతో యుద్థం చేస్తున్నారు. అంతిమంగా మనమే విజయం సాధిస్తాం. నేనే కాదు బయట చాలామంది జీవితంతో పోరాటం చేస్తున్నారు. నా ఆరోగ్యం అభిమానులు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, మద్దతుకు థాంక్స్. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. ఇదొక యుద్థం. ఆ యుద్థంలో పోరాటం చేయడానికి మీరందరూ చూపిస్తున్న ప్రేమ, మద్దతే కారణం. ప్రస్తుతం ‘యశోద’ విడుదల గురించి ఎగ్జైట్ అవుతున్నాను.
ప్రతిదీ సూపర్..
నేను ఓ కథ ఫైనల్ చేయాలంటే ఒక రోజు సమయం తీసుకుంటా. ‘యశోద’ వెంటనే ఓకే చేశా. నేను విన్న వెంటనే ఓకే చేేససిన కథల్లో ‘యశోద’ ఒకటి. ఈ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. పవర్ ఫుల్ స్టోరీ ఇది. అందుకని, ఎక్కువగా ఆలోచించడానికి ఏమీ లేదు. కథ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. ప్రేక్షకులు కూడా అదే ఫీలవుతారు. సినిమాలో అంత పవర్ ఉంది. దర్శకులిద్దరు కొత్త కాన్సెప్ట్ ముందుకు తీసుకు వస్తున్నారు. తెరపై ఈ కథ చూస్తున్నప్పుడు ప్రతి ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు. ఇది చెబితే అర్థమయ్యేది కాదు. చూస్తేనే అర్థమవుతోంది. దర్శకులు కథ, స్ర్కీన్ ప్లే రాసిన విధానం స్ర్కీన్ మీదకు తీసుకు వచ్చిన తీరు… ఫైట్స్, సెట్స్, ఆర్ట్ వర్క్, మ్యూజిక్… ప్రతిదీ సూపర్. తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన చిత్రమిది.
ఆశలకు ఆయువు పోస్తుంది.చాలా మంది ఈ కథలో మోడ్రన్ యశోదను చూపిస్తారా అనడుగుతున్నారు. ఇద్దరూ మహిళలే. ఇద్దరూ అమ్మలే. చాలా మందిని రక్షించారు. ప్రేక్షకులకు శ్రీ కృషుడిని పెంచిన ‘యశోద’ గురించి తెలుసు. పురాణాలపై అందరికీ అవగాహన ఉంది. మా సినిమా చూసిన తర్వాత ‘యశోద’ క్యారెక్టర్ గురించి అర్థం అవుతుంది. నేను చెప్పే విషయాన్ని అందరూ అంగీకరిస్తారని నమ్మకం ఉంది. సరోగసీ మీద నాకు బలమైన అభిప్రాయం లేదు. తల్లిదండ్రులు కావాలనే వారికి ఇదొక పరిష్కారం మాత్రమే. వాళ్ళ ఆశలకు ఆయువు పోస్తుంది. రా అండ్ రియల్గానేను చేసే ప్రతి కథ కొత్తగా ఉండాలనుకుంటా. అలా వచ్చిందే ఈ కథ. దీనికి ముందు ‘యు టర్న్’ థ్రిల్లర్ చేశా. యశోదలో యాక్షన్ కొత్తగా ఉంటుంది. యాక్షన్ చేయడం ఎంజాయ్ చేస్తున్నాను. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో రాజీ రోల్ కోసం యాక్షన్ చేశా. యాక్షన్ చేేసటప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది. స్టంట్ మాస్టర్ యానిక్ బెన్‌తో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’కి పని చేశా. ఆ క్యారెక్టర్ కోసం కిక్ బాక్సింగ్, బాక్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. ‘యశోద’లో నేను సింపుల్ ప్రెగ్నెంట్ లేడీగా చేశా. ఆ పాత్రకు తగ్గట్టు యాక్షన్ డిజైన్ చేశారు యానిక్ బెన్, వెంకట్ మాస్టర్… ఇద్దరూ ఫైట్స్ అన్నీ రా అండ్ రియల్‌గా ఉండేలా చూసుకున్నారు. అదే సమయంలో పాత్రకు తగ్గట్టు ఉండేలా చూశారు. కథలో పొటెన్షియల్ ఉందని…ఈ కథ చూస్తే గొప్ప ఎమోషన్ ఉంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేేస విధంగా సినిమా ఉంటుందని అర్థమైంది. బిగినింగ్ నుంచి కథలో పొటెన్షియల్ ఉందని మాకు అర్థమైంది. షూటింగ్ చేేసటప్పుడు మా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఎమోషనల్ పాయింట్ కావడంతో అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని, అందరికీ నచ్చుతుందని అనుకున్నాం. ఇప్పుడు ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం. అందరూ అనుకుంటునట్లే ప్యాన్ ఇండియాలో హిట్ అవుతుందని ఆశిస్తున్నా. అందరికీ రీచ్ అయ్యేలా రిచ్‌గా తీశారు శివలెంక కృష్ణ ప్రసాద్. సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ కోసం లోకల్ హోటల్స్, హాస్పిటల్స్ చాలా చూశారు. కానీ, ఏవీ సెట్ కాలేదు. దాంతో భారీ సెట్ వేశారు. అవుట్‌పుట్ గ్రాండ్‌గా ఉండాలని ఖర్చుకు వెనుకాడకుండా తీశారు. ట్రైలర్ విడుదలయ్యాక ఆడియన్స్ రెస్పాన్స్ చూసి చాలా సంతోషించా. అదే సమయంలో కొంచెం నెర్వస్ కూడా ఉంది. టీజర్, ట్రెలర్‌లో మేము చూపించినది నిజమే. సినిమాలో ఏం ఉందో అదే చూపించాం. ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు.
సినిమా కూడా నచ్చుతుంది.
వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్…సినిమాలో నటీనటులు అందరితో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. మన చుట్టూ ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ‘యశోద’లో వివిధ భాషల నటులున్నారు. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకునే విషయం ఒకటి ఉంది. మలయాళం యాక్టర్ డైలాగ్ చెప్పే విధానం, తెలుగు యాక్టర్లు చెప్పే విధానానికి వేరుగా ఉంటుంది. అంత మందితో కలిసి నటించడం ఆసక్తికరంగా అనిపించింది. వాళ్ళందరి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. కమిట్ అయ్యానంటే… చేయాల్సిందే..
‘యశోద’కు ముందు నుంచే డబ్బింగ్ నేనే చెప్పాలనుకున్నా. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే… చేయాల్సిందే. ఓ క్యారెక్టర్ చేేసటప్పుడు ఆర్టిస్ట్ ప్రాణం పెట్టారంటే… వాళ్ళే డబ్బింగ్ చెప్పాలని కోరుకుంటారు. తమ వాయిస్ వినిపించాలని అనుకుంటారు. నేను ఇంతే… నాలో ఆ పట్టుదల ఉంది. నాకు మొండితనం ఎక్కువ. సవాళ్లు ఎదురైనప్పటికీ డబ్బింగ్ చెప్పగలిగినందుకు సంతోషంగా ఉంది.