- మీరు మనసులో ఏం ఫీలవుతున్నారో అది మీ ముఖంలో కనిపిస్తుంది అందుకే ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి.
- మనం అందరి గురించి పాజిటివ్‌గా ఆలోచించి పాజిటివ్‌గా మాట్లాడితే అదే పాజిటివిటీ మనకు కూడా సంక్రమిస్తుంది.
- మనం కష్టాలను ఎదుర్కొంటాం ఇబ్బంది ఫీలవుతాం అదే జీవితం కానీ జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పేందుకే జరుగుతుంది అందుకే ప్రతి నెగెటివ్ విషయంలోనూ పాజిటివిటీని చూడండి.
- తక్కువ మాట్లాడటం అంటే అసలు మాట్లాడకపోవడం కాదు. అవసరమైనపుడు మాట్లాడటం
- ఒప్పుకునే ధైర్యం నీకుండాలే గానే చిన్న తప్పైన పెద్ద తప్పైన నువ్వు తప్పకుండ క్షమిస్తావు…
- ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం.. బంధాలు.. ప్రేమ.. ఆప్యాయతలు.. అన్నీ దూరమవుతాయి.
- నువ్వు విన్నది అంత త్వరగా నమ్మకు ఎందుకంటే నిజానికంటే అబద్దానికి వేగం ఎక్కువ.
- బ్రాండెడ్ బట్టలు కాకుండా సాధారణ దుస్తులు వేసుకోవడం వల్ల మీరు పేదవాళ్ళు అయినట్టు కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు కుటుంబం ఉంది పోషించడానికి కానీ సమాజాన్ని ఇంప్రెస్స్ చేయడానికి కాదు.
- క్షమించడం, క్షమించమని అడగడం ఆత్మ శాంతికి ఒకానొక ఉత్తమ మార్గం!
- జీవితం నాకు రోజుకొక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. నేర్చుకొని ముందుకెళ్లాలి. లేదా ఓడిపోయి ఆ రంగం నుండి బయటికి రావాలి. కానీ చచ్చిపోకూడదు.
- శాంతంగా సంతోషంగా ఉండేవారు ఆరోగ్యంగా జీవిస్తారు.
- ఎప్పుడు గెలిచేవాడు గెలిస్తే అది హెడ్ లైన్స్ ఎప్పుడు ఓడిపోతున్నవాడు గెలిస్తే అది హిస్టరీ…
- కష్టించి పని చేసేవానికే విశ్రాంతిలోని ఆనందం తెలుస్తుంది.
- మనిషి తప్పు చేయడం సహజం, కాని చేసిన తప్పును తెలుసుకొనే మానసిక పరిజ్ఞానం లేకపోవడమే తప్పు, తన తప్పును సరిదిద్దుకొనేవాడే ఉత్తమ పౌరుడు.
- నిజం చెప్పకపోవడం అబద్దం… అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం…
- ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది ముఖ్యం కాదు ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యం.
- ఓడిపోతామేమో అన్న భయం గెలుపుని దక్కనివ్వకుండా చేస్తుంది.
- ఒక్క నిజం కొద్దిసేపు బాధపెడుతుందేమో గానీ ఒక్క అబద్దం జీవితాంతం వేధిస్తుంది.
- అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు.
- గెలిస్తే వినయంగా ఉండు… ఓడిపోతే ఓర్పు గా ఉండు… డబ్బుంటే దయాగుణం తో ఉండు… డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు…